వాగు ఒడ్డునే పురుడు:తల్లీబిడ్డ మృతి | Mother and daughter died without getting medical help | Sakshi
Sakshi News home page

వాగు ఒడ్డునే పురుడు:తల్లీబిడ్డ మృతి

Aug 11 2014 4:00 PM | Updated on Oct 9 2018 7:52 PM

వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిండు గర్భిణి బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది.

వరంగల్: గ్రామాలలో వైద్య సదుపాయం లేక అనేక మంది చనిపోతున్నారు. ఈ రోజు కూడా అటువంటి సంఘటనే వరంగల్ జిల్లాలో జరిగింది.  వైద్యం అందుబాటులో లేకపోవడంతో నిండు గర్భిణి బహిరంగ ప్రదేశంలోనే ప్రసవించింది. తల్లీబిడ్డ ఇద్దరూ మృతి చెందారు.
 
వరంగల్‌ జిల్లా గోవిందరావుపేట-ముత్తాపురం మధ్య దెయ్యాల వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. నిండు గర్భిణి అయిన రాజేశ్వరికి పురిటి నొప్పులు రావడంతో ఆస్పత్రికి తీసుకువెళుతున్నారు. మధ్యలో వాగు ఉద్ధృతంగా ఉంది. వారు వాగు దాటలేకపోయారు. ఆమె వాగు ఒడ్డునే పురుడు పోసుకుంది. వైద్యులు అందుబాటులో లేకపోవడంతో తల్లితోపాటు అప్పుడే పుట్టిన ఆడపిల్ల కూడా మృతి చెందింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement