కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ దొందూ దొందే | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ దొందూ దొందే

Published Wed, Sep 25 2019 11:14 AM

MLC Ramachandra Rao slams On Congress And TRS - Sakshi

సాక్షి, నాగర్‌కర్నూల్‌ : యురేనియం నిక్షేపాల సర్వేపై గతంలోనే యూపీఏ అనుమతులు ఇచ్చినా ప్రస్తుత బీజేపీ ప్రభుత్వంపై బురదజల్లేందుకు కాంగ్రెస్‌ పార్టీ ప్రయత్నిస్తోందని  ఎమ్మెల్సీ ఎన్‌.రామచంద్రరావు ఆరోపించారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని సీఎన్‌రెడ్డి సేవాసదన్‌లో విలేకరులతో ఆయన మాట్లాడారు. 2016లోనే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వన్యప్రాణుల సంరక్షణ కమిటీ నల్లమల అటవీప్రాంతంలో యురేనియం నిక్షేపాల కోసం  బోర్లు వేయడానికి అనుమతులు మంజూరు చేసిందన్నారు. ఈ రెండు పార్టీలు దొందూ దొందేనని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ సంస్థలు దేశంలో ఎక్కడయినా నిక్షేపాలు ఉంటే వాటిపై సర్వే చేస్తాయన్నారు. వన్యప్రాణులు, అటవీసంపద పరిరక్షణకు రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి బీజేపీ మద్దతు ఇస్తుందన్నారు. అనంతరం మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రవదన్‌ మాట్లాడుతూ 370 ఆర్టికల్‌ వల్ల సామాన్యులకు ఎలాంటి లాభం లేదని అందుకే దానిని కశ్మీర్‌లో రద్దు చేశారన్నారు. దీని ఫలితాలను ప్రజలకు వివరించడానికే సంపర్క్‌ అభియాన్‌ నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యదర్శి బాల్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, అసెంబ్లీ ఇన్‌చార్జ్‌ దిలీపాచారి, పార్లమెంట్‌ కన్వీనర్‌ సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

సాహసోపేత నిర్ణయం..
ఉప్పునుంతల (అచ్చంపేట): 370 ఆర్టికల్‌ రద్దు ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న సాహసోపేత నిర్ణయమని ఎమ్మెల్సీ రామచంద్రరావు అన్నారు. మంగళవారం ఉప్పునుంతలలో విలేకరులతో ఆయన మాట్లాడారు. దీనివల్ల కొద్ది మంది చేతుల్లో ఉన్న ఆర్థిక వ్యవస్థను ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. కశ్మీర్‌లో అభివృద్ధి జరిగి యువతకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. ము ఖ్యంగా పాక్‌ ప్రేరేపిత ఉగ్రవాదం పూర్తిగా కనుమరుగవుతుందన్నారు. నల్లమలలో యురేని యం తవ్వకాల కోసం అప్పటి యూపీఏ ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన విషయాన్ని మర్చి పోయి ఇప్పుడు కాంగ్రెస్‌ నాయకులు ధర్నాలు చేయడం విడ్డూరంగా ఉందని  ఆయన ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో బీజేపీ నాయకులు కట్టా సుధాకర్‌రెడ్డి. మేడిపూరి మల్లేశ్వర్, మం గ్యానాయక్, కుందేళ్ల సైదులుయాదవ్, ఎల్లయ్యయాదవ్, మహేష్‌యాదవ్‌  పాల్గొన్నారు.

Advertisement
Advertisement