
వేములవాడ: తనకు వారసత్వంగా వచ్చిన వ్యవసాయభూములపై అందే పెట్టుబడి సాయం రూ.1.20 లక్షలను రైతునిధికి విరాళంగా అందజేస్తానని వేములవాడ శాసనసభ్యుడు సీహెచ్ రమేశ్‌బాబు ప్రకటించారు. ఆదివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ, రైతుబంధు పథకం ద్వారా రైతుల జీవితాల్లో వెలుగులు నింపే కార్యక్రమం ప్రారంభం కాబోతుందన్నారు.
రాష్ట్రంలోని భూస్వాములు పెద్ద మనసు చేసుకుని చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు వారికి వచ్చే పెట్టుబడి సాయాన్ని రైతునిధికి అందజేయాలని కోరారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నామాల ఉమ, టీఆర్‌ఎస్ నాయకులు పాల్గొన్నారు.