కిడ్నాప్ కు గురైన పాప ఆచూకీ లభ్యం | missing kid found | Sakshi
Sakshi News home page

కిడ్నాప్ కు గురైన పాప ఆచూకీ లభ్యం

Mar 7 2015 11:06 PM | Updated on Sep 4 2018 5:16 PM

హైదరాబాద్ లో కలకలం సృష్టించిన చిన్నారి మమత ఆచూకీ శనివారం లభించింది.

హైదరాబాద్:నగరంలో కలకలం సృష్టించిన చిన్నారి మమత ఆచూకీ శనివారం లభించింది. ఆ పాప కుషాయిగూడలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సీసీ కెమెరాల ఆధారంగా పాప ఆచూకీని పోలీసులు కనుగొన్నారు. శుక్రవారం నల్లకుంటలో ఓ వీధిలో ఆడుకుంటున్న ముగ్గురు చిన్నారులకు మాయమాటలు చెప్పిన ఓ గుర్తు తెలియని మహిళ వారిని అపహరించింది.

 

అయితే మార్గ మద్యంలో ఇద్దరు చిన్నారులను వదిలేసినప్పటికీ చిన్నారి మమతను మాత్రం తన వెంట తీసుకెళ్లిన సంగతి తెలిసిందే. దీనిపై పోలీసులు తమ గాలింపును తీవ్రతరం చేసి పాప ఆచూకీని కనుగొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement