వరంగల్‌ అభివృద్ధి మాస్టర్‌ ప్లాన్‌: కేటీఆర్‌

Minister ktr visits warangal  - Sakshi

సాక్షి, వరంగల్‌: వరంగల్ నగర అభివృద్ధి ప్రతిబింబించేలా మాస్టర్ ప్లాన్‌ రూపకల్పన ఉంటుందని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. హన్మకొండలోని కాకతీయ పట్టణాభివృద్ధి సంస్ధ (కుడా) కార్యాలయంలో బుధవారం వరంగల్ అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్‌పై ఆయన అధికారులతో సమీక్ష జరిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జూన్‌ 15 కల్లా మాస్టర్‌ ప్లాన్‌ పూర్తి చేస్తామని తెలిపారు. నగరం చుట్టూ 500 ఎకరాల్లో టౌన్‌షిప్‌ అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. మమునూరు ఎయిర్‌పోర్టును త్వరలో పునరుద్ధరిస్తామన్నారు. కూడా భూముల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని చెప్పారు.

అదే విధంగా వరంగల్‌లో సమగ్ర రవాణ సర్వే చేస్తామని కేటీఆర్‌ తెలిపారు.ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి, మంత్రి చందూలాల్, వరంగల్ అర్బన్‌, రూరల్‌ జిల్లాల కలెక్టర్లు అమ్రపాలి, హరిత, నగర మేయర్ నన్నపనేని నరేందర్ తదితరులు పాల్గొన్నారు. సమావేశ అనంతరం అయన పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top