పల్లెల నుంచే ఆవిష్కరణలు

Minister KTR Speech At Telangana Industry Awards 2019 - Sakshi

ప్రపంచ మార్కెట్‌కు పోటీనిచ్చేలా ఉత్పత్తులుండాలి

కొత్త ఆవిష్కరణలతో వస్తే పరిశ్రమలకు సకల సౌకర్యాలు

ఇండస్ట్రీ అవార్డ్స్‌–2019’ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌:ఆవిష్కరణలు నగరాలు కేంద్రంగా జరగవని, ఎక్కడో మారుమూల ప్రాంతా ల నుంచే వస్తాయని ఐటీ మంత్రి కేటీఆర్‌ అన్నారు. నూతన ఆవిష్కరణలతో వస్తే.. పరిశ్రమలకు తాము సకల సదుపాయాలు కల్పిస్తామన్నారు. ఉ న్నత విద్యను పరిశ్రమలతో అనుసంధానిస్తే.. ఉత్పత్తి రంగంలో నైపుణ్యమున్న మానవ వనరు లు సృష్టించి, నూతన ఆవిష్కరణలకు బీజం వేసిన వారిమవుతామన్నారు. శుక్రవారం మాదాపూర్‌లో ని హెచ్‌ఐసీసీలో కాన్ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియన్‌ ఇండస్ట్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన ‘ఇండస్ట్రీ అవార్డ్స్‌ –2019’కార్యక్రమానికి కె.తారకరామారావు ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. ‘గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి బహుమతులు గెలుచుకున్న ఆవిష్కరణలకు శుభాకాంక్షలు.

ఈ బృహత్తర కార్యక్రమాన్ని చేపట్టిన సీఐఐకి కృతజ్ఞతలు..  తె లంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. రాష్ట్రప్రభుత్వం ప్రారంభించిన టీఎస్‌ ఐపాస్‌కు వచ్చే నవంబర్‌లో ఐదేళ్లు పూర్తవనున్నాయి. ఇప్పటికే ఐపాస్‌ ద్వారా 11 వేల పరిశ్రమలకు అనుమతులిచ్చాం. రూ.1.70 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించి 13 లక్షల ప్రత్యక్ష ఉద్యోగాలు కల్పించగలిగాం. ఈ ఒరవడి ఇలాగే కొనసాగాలని ఆకాంక్షిస్తున్నా. రాష్ట్రం 14.9 వృద్ధిరేటు (జీఎస్‌డీపీ)తో ముందుకు సాగుతుండటం ఆనందకరం.

లైఫ్‌సైన్సెస్, ఐటీ, ఏరోస్పేస్, రక్షణ తదితర ఉత్పత్తుల రంగాలకు తెలంగాణ..ప్రత్యేకించి హైదరాబాద్‌ కేంద్రంగా మారిన విషయం తెలిసిందే. ఆవిష్కరణలంటే హైదరాబాద్‌ లాంటి నగరాల నుంచే వస్తారని అనుకోను. మారుమూల ప్రాంతాలనుం చి చక్కటి ఆవిష్కరణలు వస్తుండటమే ఇందుకు ని దర్శనం. మహబూబ్‌నగర్‌లోని మారుమూల ప్రాంతమైన ఐజ, ఆసిఫాబాద్‌ జిల్లా సరిహద్దులోని తిర్యానీ, కరీంనగర్‌ నుంచి ఉన్నారు..’అని చెప్పారు.

కేంద్రం తరహాలోనే ప్రోత్సాహం.. 
కేంద్ర ప్రభుత్వం స్టార్టప్‌లను ప్రోత్సహించిన తరహాలోనే తెలంగాణ కూడా ప్రోత్సహిస్తోందని కేటీఆర్‌ అన్నారు. ‘మీకు అత్యంత అద్భుతమైన వేదిక  కల్పిస్తున్నాం. అన్నిరకాల చేయూతనందిస్తున్నాం. ఎన్నో సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి. అద్భుతమైన ఆవిష్కరణలతోనే యువ ఎంటర్‌ప్రెన్యూర్లు వీటిని అందిపుచ్చుకోవాలి. అమెరికా–చైనాల మధ్య వాణిజ్య యుద్ధం జరుగుతున్న ఈ సమయంలో వినూత్న పారిశ్రామిక ఆవిష్కరణల తో ప్రపంచదేశాలను ఆకర్షించేందుకు కృషి చేయాలి.

తెలంగాణ పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి స్వర్గధామం. తెలంగాణలో మైక్రో మ్యాక్స్‌ మూడే ళ్ల కిందపని ప్రారంభించి పలువురికి ఉపాధి అవకాశాలు కల్పించింది. ఫ్రెంచ్‌కు చెందిన ఏరోస్పేస్‌ కంపెనీ సాఫ్రన్‌ తెలంగాణలో పారిశ్రామిక విధా నం నచ్చి పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చింది. ప్రభుత్వం వద్ద పరిమిత ఉపాధి వనరులున్నాయి. ప్రభుత్వం–పారిశ్రామికరంగం కలిస్తే.. కొత్త ఉద్యోగావకాశాలు సృష్టించగలం. టాస్క్‌ ద్వా రా యువతకు వివిధ రంగాల్లో నైపుణ్యం సాధించేందుకు శిక్షణ ఇస్తున్నాం..’ అని అన్నారు.

సీఐఐకి మరోసారి విజ్ఞప్తి.. 
కాలేజీలను స్థానిక పరిశ్రమలను అనుసంధానించాలని కేటీఆర్‌ చెప్పారు. అప్పుడే నైపుణ్యమున్న మానవ వనరులను సృష్టించగలమన్నారు. జర్మనీలాంటి దేశాల నుంచి కొత్త పరిశ్రమలు వచ్చేలా కృషి చేయాలని సీఐఐకి మరోసారి విజ్ఞప్తి చేస్తు న్నా. అత్యధిక వృద్ధిరేటు సాధించిన మహీంద్రా కంపెనీకి శుభాకాంక్షలు. కార్పొరేట్‌ కంపెనీలన్నీ సామాజిక సేవలో మరింత భాగస్వామ్యం కావా లని విన్నవిస్తున్నా.

జేకే గ్రూపు సాయంతో ప్రభు త్వ స్కూళ్లలో మరుగుదొడ్లు నిర్మించగలిగాం. ఇదేవిధంగా మిగిలిన కంపెనీలు కూడా ముందుకు రావాలని కోరుతున్నా..’అని ముగించారు. కార్యక్రమంలో ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, సీఐఐ చైర్మన్‌ డి.రాజు, చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top