విద్యార్థులతో పాటు భోజనం చేసిన మంత్రి | minister eetela rejender ate lunch with students | Sakshi
Sakshi News home page

విద్యార్థులతో పాటు భోజనం చేసిన మంత్రి

Jan 27 2015 4:25 PM | Updated on Aug 29 2018 7:54 PM

తెలంగాణలో ప్రారంభించిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు .

కరీంనగర్: ఇతర రాష్ట్రాల్లో లేని విధంగా తెలంగాణలో ప్రారంభించిన సన్నబియ్యం పథకం దేశానికే ఆదర్శమని రాష్ట్ర ఆర్ధిక శాఖ మంత్రి ఈటెల రాజేందర్ అన్నారు . ఈ పథకం సక్రమంగా అమలు చేయడానికి మార్చి నెల నుంచి 50 మెట్రిక్ టన్నల బియ్యాన్ని పంపిణీ చేయడానికి ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని మంత్రి చెప్పారు.

మంగళవారం ఆయన కరీనంగర్ జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రపల్లి గ్రామంలోని పాఠశాలలో కొత్తగా ఏర్పాటుచేసిన హాస్టల్ భవనాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాఠ శాలలో మరామ్మత్తులు ఉంటే వాటిని వెంటనే పూర్తి చేయాలని మంత్రి అధికారులకు సూచించారు. మధ్యాహ్న భోజన కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో కలిసి మంత్రి భోజనం చేశారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement