‘ఎస్సై మాతో దురుసుగా ప్రవర్తించాడు’ | Migrant Workers Protest At LB Nagar Police Station | Sakshi
Sakshi News home page

తినడానికే తిండి లేదు.. కార్లు ఎక్కడి నుంచి వస్తాయి..

May 4 2020 12:41 PM | Updated on May 4 2020 12:51 PM

Migrant Workers Protest At LB Nagar Police Station - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : లాక్‌డౌన్‌ సమయంలో కేంద్రం వలస కూలీలు స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో వారు పెద్ద ఎత్తున సమీపంలోని పోలీస్‌ స్టేషన్‌లకు చేరకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం అనుమతి పత్రాల కోసం ఎల్‌బీ నగర్‌ పోలీస్‌ స్టేషన్‌ భారీగా వలస కూలీలు తరలివచ్చారు. అయితే పోలీసులు మాత్రం స్వంత వాహనాలు ఉంటేనే స్వస్థలాకు వెళ్లేందుకు అనుమతి పత్రాలు ఇస్తామని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పోలీస్‌ స్టేషన్‌ పరిసరాల్లో గందగోళం ఏర్పడింది. 

మరోవైపు అనుమతి పత్రాల కోసం వచ్చిన తమపై ఎల్బీ నగర్‌ ఎస్సై సుధాకర్‌ దురుసుగా ప్రవర్తించారని శ్రీకాకుళంకు చెందిన చండీశ్వరి ఆరోపించారు. తమ దంపతులను ఎస్సై బుద్ధి ఉందా అంటూ తిట్టారని చెప్పారు. ఇంకా చండీశ్వరి దంపతులు మాట్లాడుతూ.. ‘మా కూతురు గర్భవతి. ఆమెకు ఆపరేషన్‌ ఉండటంతో మమ్మల్ని శ్రీకాకుళానికి పంపించమని పోలీసులను వేడుకున్నప్పటికీ వారు కనికరించలేదు. పైగా అనుమతి పత్రాలు కావాలంటే కారు తెచ్చుకోవాలని చెప్తున్నారు. అలా అయితేనే అనుమతి ఇస్తామని అంటున్నారు. తినడానికి తిండి లేని తాము  కారు ఎక్కడి నుంచి తీసుకువస్తాం’ అని ఆవేదన వ్యక్తం చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement