ఎంఈసీలో ఇక నుంచి పీహెచ్‌డీ కోర్సులు

MEC Launch Ph.D Program in Engineering & Applied Sciences from 2020 academic session - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: మహీంద్రా యూనివర్శిటీ ఎకోల్ సెంట్రల్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ (ఎంఇసి) 2020 విద్యా సంవత్సరం నుంచి పీహెచ్‌డీ కోర్సులను అందుబాటులోకి తీసుకురానుంది. ఇంజనీరింగ్‌, అప్లైడ్‌ సైన్స్‌, హుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్సెస్‌లో పీహెచ్‌డి కోర్సులు అందించనుంది. ఇంజనీరింగ్‌లో కంప్యూటర్‌ సైన్స్‌, సివిల్‌, ఎలక్ట్రికల్ అండ్‌ మెకానికల్‌ ఇంజనీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ్స్‌, అప్లైడ్‌సైన్స్‌లలో పీహెచ్‌డీ కోర్సును అందించనున్నారు. ఎవరైతో ఆర్ట్స్‌ పీహెచ్‌డీ చేయాలనుకుంటున్నారో అలాంటి వారి కోసం హుమానిటీస్‌ అండ్‌ సోషల్‌ సైన్స్‌లో పీహెచ్‌డీ కోర్సులు నిర్వహిస్తోంది. ఫుల్‌ టైం పీహెచ్‌డీ స్కాలర్స్‌కు ఉచిత వసతి, భోజనంతో పాటు నెలకు రూ. 25,000 స్కాలర్‌ షిప్‌ను అందిచనున్నారు.  ప్రతి వారం 8 గంటల పాటు కచ్చితంగా  తరగతులు నిర్వహిస్తారు.

(ఏఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం)

 అత్యుత్తమ ఫ్యాకల్టీతో విద్యాబోధన, వివిధ రకాల  టెక్నాలజీలకు సంబంధించి అన్ని సౌకర్యాలతో కూడిన 23 ల్యాబ్‌లు, సూపర్‌ కంప్యూటర్‌ ల్యాబ్‌లు, వీఎల్‌ఎస్‌ఐ ల్యాబ్‌, ఆటోమోటివ్‌ అండ్‌ కంబషన్‌ ఇంజన్స్‌ ల్యాబ్‌, సెంటర్‌ ఫర్‌ రోబోటిక్స్‌, ఎన్విరాన్‌మెంటల్‌ ఇంజనీరింగ్‌ మొదలైన ల్యాబ్‌లు కలవు. వీటితో పాటు ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్‌ అండ్‌ మిషన్‌ లెర్నింగ్‌, మెటిరీయల్స్‌, ఆప్టిక్స్‌ అండ్‌ అప్టోఎలక్టట్రానిక్స్‌, అప్లైడ్‌ మ్యాథ్‌మ్యాటిక్స్‌ అండి స్టాటిస్టిక్స్‌, ఎర్త్‌ అండ్‌ ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌, డిజిటల్‌ మీడియా అండ్‌ టెక్నాలజీకి సంబంధించి వివిధ రంగాలలో పరిశోధనలకు యమ్‌ఈసీ అవకాశం కల్పిస్తోంది. అర్హతలు ఉన్నవారు జూన్‌ 27 వరకు అప్లై చేసుకోవచ్చు. దీనికి  సంబంధించిన అర్హతల కోసం ఈ లింక్‌ క్లిక్‌ చేయండి. 

(https://www.mahindraecolecentrale.edu.in/programs/phd)

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top