కుటుంబ కలహాలతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది.
మహబూబ్ నగర్ (ఆత్మకూర్) : కుటుంబ కలహాలతో ఓ వివాహిత పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. వివరాల ప్రకారం... మహబూబ్ నగర్ జిల్లా నర్వ మండల పరిధిలోని యాంకి గ్రామానికి చెందిన జ్యోతి(20) కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో వున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు జ్యోతిని 108 వాహనంలో ఆత్మకూర్‌లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆమె పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితురాలిని జిల్లా కేంద్రం ఆసుపత్రికి తరలించారు. కాగా జ్యోతికి భర్త, ఇద్దరు పిల్లలు ఉన్నారు.