
సాక్షి, భద్రాద్రి కొత్తగూడెం : జిల్లాలోని మణుగూరు మండలం విజయనగరం గ్రామంలో మావోయిస్టు కరపత్రాలు కలకలం రేపాయి. గురువారం మావోయిస్టులు కరపత్రాల ద్వారా కొంతమంది ప్రజాప్రతినిధులకు తీవ్ర స్థాయిలో హెచ్చరికలు జారీ చేశారు. ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనుచరులతో పాటు మరి కొంతమందిని మావోయిస్టులు హెచ్చరించారు.
‘విజయనగరం గ్రామంలో ఇసుక దందా, భూ సెటిల్‌మెంట్స్, భూకబ్జాలకు పాల్పడుతూ.. కుల రాజకీయాలను రెచ్చగొడుతున్న ఎనిమిది మందికి వార్నింగ్. పద్ధతి మార్చుకోకపోతే ఏరివేత తప్పద’ని కరపత్రాలలో పేర్కొన్నారు. మావోయిస్టు చర్ల, దుమ్ముగూడెం ఏరియా కార్యదర్శి పేరిట ఈ కరపత్రాలు వెలిశాయి.