ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో తుపాకీ కలకలం | Man Held With Pistol at Uppal Metro Station | Sakshi
Sakshi News home page

ఉప్పల్‌ మెట్రో స్టేషన్‌లో తుపాకీ కలకలం

Mar 29 2018 11:57 AM | Updated on Oct 16 2018 5:07 PM

Man Held With Pistol at Uppal Metro Station - Sakshi

 సతీష్‌, స్వాధీనం చేసుకున్న తుపాకీ

ఉప్పల్‌ : ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌లో రైలు ఎక్కబోతున్న వ్యక్తి వద్ద తుపాకీ లభ్యం కావడంతో కలకలం సృష్టించింది. ఉప్పల్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు కథనం మేరకు.. భూపాలపల్లి జిల్లా, కాటారం గ్రామానికి చెందిన తోట సతీష్‌ అదే ప్రాంతానికి చెందిన జెడ్పీటీసీ సల్ల నారాయణరెడ్డి వద్ద డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నారాయణరెడ్డి వ్యాపార పనుల నిమిత్తం పూణె వెళుతూ తన తుపాకీని డ్రైవర్‌కు ఇచ్చి వెళ్లాడు. డ్రైవర్‌ సతీష్‌ మంగళవారం రాత్రి కూకట్‌పల్లి వెళ్లేందుకు ఉప్పల్‌ మెట్రోస్టేషన్‌కు వెళ్లాడు. తన వద్ద తుపాకీ ఉండటంతో ఇదే విషయాన్ని సెక్యూరిటీ సిబ్బందికి చెప్పాడు. దీంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. ఉప్పల్‌ పోలీసులు సతీష్‌ వద్ద ఉన్న 7.65 ఎంఎం తుపాకీ, 8 రౌండ్లను స్వాధీనం చేసుకున్నారు. సతీష్‌ను అదుపులోకి తీసుకుని, అతనితో పాటు నారాయణరెడ్డిపై కేసు నమోదు చేశారు. కాగా తుపాకీకి లైసెన్స్‌ ఉన్నట్టు ఇన్‌స్పెక్టర్‌ పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement