రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి | man felt under the train and died | Sakshi
Sakshi News home page

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి

Mar 2 2015 9:40 PM | Updated on Sep 2 2017 10:11 PM

రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది.

వరంగల్:  రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు...వరంగల్ జీఆర్‌పీ సీఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణంలోని దర్గా కాజిపేట, న్యూ శ్యాంపేటల మద్య ఉన్న బీసీ కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు నుంచి జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద సికింద్రాబాద్-రాజమండ్రికి వెళ్లేందుకు ఉద్దేశించిన టికెట్ లభించిందని, మృతుని కుడిచేయిపై సామలక్ష్మి అని పచ్చబొట్టుతో రాసి ఉందని సీఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరచినట్లు వెల్లడించారు.
(మట్టెవాడ)

Advertisement

పోల్

Advertisement