breaking news
khazipet-new sampet
-
16 నెలల తర్వాత ప్యాసింజర్ రైళ్ల కూత
సాక్షి, హైదరాబాద్: దాదాపు 16 నెలల సుదీర్ఘ విరామం తర్వాత కొన్ని ప్యాసింజర్ రైళ్లను ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే సిద్ధమైంది. గతేడాది కోవిడ్ తొలిదశ లాక్డౌన్ సందర్భంగా మార్చి నెలాఖరు నుంచి రైళ్లను నిలిపివేసిన విషయం తెలిసిందే. లాక్డౌన్ సడలింపులతో కొన్ని స్పెషల్ రైళ్లుగా ఎక్స్ప్రెస్ సర్వీసులను ప్రారంభించిన రైల్వే.. ప్యాసింజర్ రైళ్లను మాత్రం ప్రారంభించలేదు. ఇప్పుడు దశలవారీగా వాటిని ప్రాంభించాలని నిర్ణయించింది. ఈ మేరకు రైల్వేబోర్డు జోనల్ రైల్వే అధికారులకు ఆదేశాలు జారీచేసింది. దీంతో జూలై 19 నుంచి నాలుగు రోజుల్లో తొలివిడతగా 66 ప్యాసింజర్ స్పెషల్ సర్వీసుల (జోన్ అంతా కలిపి)ను ప్రారంభిస్తోంది. వీటిని కొత్త సమయాలు, నంబర్లతో నడపనున్నారు. వీటితోపాటు జోన్ పరిధిలో నడిచే కొన్ని స్పెషల్ ఎక్స్ప్రెస్ సర్వీసులనూ ప్రారంభిస్తున్నారు. మెమూ, డెమూ రైళ్లనే ఈ స్పెషల్ సర్వీసులుగా నడుపుతుండటం విశేషం. 19న ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్లు కాజీపేట–సిర్పూర్ టౌన్ (ఉదయం 5.20), సిర్పూరు టౌన్–భద్రాచలం రోడ్ (12.30), హైదరాబాద్–పూర్ణ (8.15), పూర్ణ–హైదరాబాద్(7.40), విజయవాడ–గూడూరు (5.25), కాకినాడ పోర్టు– విజయవాడ (4.45), కాకినాడ పోర్టు–విశాఖపట్నం (5.00), విశాఖపట్నం– కాకినాడ పోర్టు (17.05). 19న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైళ్లు వాడీ–కాచిగూడ (14.25), ఫలక్నుమా–వాడి (5.00), డోర్నకల్–కాజీపేట (21.10), విజయవాడ–డోర్నకల్ (18.15), సికింద్రాబాద్– కాలబుర్గీ (18.00), కాచిగూడ–మహబూబ్నగర్ (21.50), మహబూబ్నగర్–కాచిగూడ (6.45), కాచిగూడ–నడికుడి (9.20), నడికుడి– కాచిగూడ (16.10), కాచిగూడ–కరీంనగర్ (6.00). 20 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్లు భద్రాచలం రోడ్–సిర్పూర్ టౌన్ (6.00), సిర్పూర్ టౌన్–కాజీపేట (15.50). 20న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైళ్లు వరంగల్–సికింద్రాబాద్ (5.15), హైదరాబాద్–కాజీపేట (18.50), కరీంనగర్–పెద్దపల్లి (8.00), పెద్దపల్లి–కరీంనగర్ (13.10), కరీంనగర్–కాచిగూడ (14.20), కాలబుర్గీ–సికింద్రాబాద్(3.30). 21 నుంచి ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్ గుంటూరు–కాచిగూడ (5.15). 21 నుంచి ప్రారంభమయ్యే ప్యాసింజర్లు కాజీపేట–డోర్నకల్ (6.40), డోర్నకల్–విజయవాడ (9.00), సికింద్రాబాద్–మనోహరాబాద్ (6.10), మనోహరాబాద్–సికింద్రాబాద్ (8.45), కాచిగూడ–రాయచూరు (6.20), రాయచూరు–కాచిగూడ (17.00), పర్లీ–ఆదిలాబాద్ (15.45), విజయవాడ–మంచిర్యాల (15.30). 22న ప్రారంభమయ్యే ఎక్స్ప్రెస్ కాచిగూడ–గుంటూరు (5.10). 22న ప్రారంభమయ్యే ప్యాసింజర్ రైలు: ఆదిలాబాద్–పర్లి (3.30). -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
వరంగల్: రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు...వరంగల్ జీఆర్పీ సీఐ రవికుమార్ అందించిన వివరాల ప్రకారం... వరంగల్ పట్టణంలోని దర్గా కాజిపేట, న్యూ శ్యాంపేటల మద్య ఉన్న బీసీ కాలనీ వద్ద గుర్తు తెలియని వ్యక్తి(35) రైలు నుంచి జారిపడి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుని వద్ద సికింద్రాబాద్-రాజమండ్రికి వెళ్లేందుకు ఉద్దేశించిన టికెట్ లభించిందని, మృతుని కుడిచేయిపై సామలక్ష్మి అని పచ్చబొట్టుతో రాసి ఉందని సీఐ పేర్కొన్నారు. కేసు నమోదు చేసుకుని మృత దేహాన్ని ఎంజీఎం మార్చురీలో భద్రపరచినట్లు వెల్లడించారు. (మట్టెవాడ)