పొలానికి నీరందించే బోరు మోటారుకు కరెంటు సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన రైతు షాక్‌తో నిలువునా కుప్పకూలిపోయాడు.
రంగారెడ్డి జిల్లా: పొలానికి నీరందించే బోరు మోటారుకు కరెంటు సరఫరా కావడం లేదని ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లిన రైతు షాక్‌తో నిలువునా కుప్పకూలిపోయాడు. ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. ఈ సంఘటన రంగారెడ్డిజిల్లా బొంరాస్‌పేట మండలం నాగిరెడ్డిపల్లి శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలు.. గ్రామానికి చెందిన మొగిలి కిష్టయ్య(46) శుక్రవారం ఉదయం తన బోరు మోటారుకు విద్యుత్ సరఫరా అయ్యే ట్రాన్స్‌ఫార్మర్ వద్దకు వెళ్లాడు.
దానిని మరమ్మతు చేసేందుకు ప్రయత్నించటంతో ప్రమాదవశాత్తు షాక్‌కు గురై స్పృహ కోల్పోయాడు. సమీప పొలాల్లో ఉన్న రైతులు కిష్టయ్యను ఆస్పత్రికి తరలిస్తుండగా చనిపోయాడు. అతనికి భార్య అంజిలమ్మ, కొడుకు, ఇద్దరు కూతుళ్లున్నారు.
(బొంరాస్‌పేట)