
రేగొండ(భూపాలపల్లి): సైకిల్‌పై రోడ్డు దాటుతున్న వ్యక్తిని తవేరా వాహనం ఢీకొనడంతో అతడు అక్కడికక్కడే మృతిచెందగా, బాలుడికి గాయాలపాలైన సంఘటన మండల కేంద్రంలోని పరకాల–భూపాలపల్లి ప్రధాన రహదారిపై శుక్రవారం జరిగింది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. చిట్యాల మండలం తిర్మలాపురం గ్రామానికి చెందిన అంకం మల్లయ్య(55) సంక్రాంతికి ఇదే మండలంలోని గోరికొత్తపల్లిలోని కూతురు ఇంటికి వెళ్లాడు.
తిరిగి శుక్రవారం తన మనవడు చిన్నబాబును సైకిల్‌పై ఎక్కించుకుని తిర్ములాపురానికి బయల్దేరి మండల కేంద్రానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో డీబీఎం–38 కాల్వ వద్ద పరకాల–భూపాలపల్లి ప్రధాన ర«హదారిని సైకిల్‌పై దాటుతుండగా పరకాల వైపు నుంచి వస్తున్న తవేరా వాహనం ఢీకొంది. దీంతో మల్లయ్య రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతిచెందగా, మనవడు తలకు స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డాడు. తవేరా వాహనాన్ని అజాగ్రత్తగా నడిపిన డ్రైవర్ రేగొండకు చెందిన చల్ల భరత్‌గా గుర్తించారు. కాగా మృతుడి వద్ద బాబు రోదిస్తున్న తీరును చూసి ప్రయాణికులు కంటతడి పెట్టారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.