నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది.
చౌటుప్పల్ (నల్లగొండ) : నల్లగొండ జిల్లా సంస్థాన్ నారాయణపురం మండలంలో దారుణం చోటుచేసుకుంది. మండలంలోని అల్లందేవిచెరువు గ్రామానికి చెందిన సుర్వి మహేశ్.. గురువారం సాయంత్రం కత్తితో భార్య, కొడుకు గొంతు కోసి అనంతరం ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు.
సాయంత్రం పొలం నుంచి వచ్చిన మహేశ్ తల్లిదండ్రులు.. ఇంట్లో కొడుకు, కోడలు, మనువడి మృతదేహాలను చూసి ఖిన్నులయ్యారు. కాగా ఈ ఘటనపై మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.