భీం ధామం అద్భుతం..!

Maharashtra Adivasi Society Chairman Shyamrao Kotnake Visits Kumra Bhim Museum - Sakshi

ఆదివాసీ సొసైటీ చైర్మన్‌ శ్యాంరావు

జోడేఘాట్‌ సందర్శన

కెరమెరి(ఆసిఫాబాద్‌): ఆదివాసీల అడవి బిడ్డ కుము రం భీం ధామం చాలా అద్భుతంగా ఉందని మహా రాష్ట్ర ఆదివాసీ సొసైటీ చైర్మన్‌ శ్యాంరావు కోట్నాకే, రాజూర తహసీల్దార్‌ వరోవింద్రవోటి అన్నారు. మంగళవారం మండలంలోని చారిత్రాత్మక ప్రదేశమైన జోడేఘాట్‌ను వారు సందర్శించారు. కుమురం భీం చిత్రపటానికి పూల మాల వేసి నివాళి అర్పించారు. నాలుగు గోత్రాలకు చెందిన జెండాల ముందు పూజలు చేశారు. అనంతరం మ్యూజియాన్ని సందర్శించారు. వారికి క్యూరేటర్‌ మంగంరావు అవగాహన కల్పించారు. ఆదివాసీల ఆభరణాలు, విల్లులు, వాడుకునే వస్తువులను చూశారు. ఫొటో ఎగ్జిబిషన్‌ తిలకించారు. అనంతరం కోయ, గోండు, కొలాం, నాయక్‌పోడ, పెర్సపేన్, పహండి కుపర్‌లింగో తదితర దేవతలకు పూజలు చేశారు. గిరిజన సంప్రదాయం, ఆదివాసీ ఆచార వ్యవహారాలను అడిగి తెలుసుకున్నారు. మహారాష్ట్రకు చెందిన పర్యాటకులు భారీగా తరలివచ్చారు.   

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top