అంబేద్కర్‌ సాక్షిగా పసుపు బోర్డు సాధిస్తా..

Madhu yaskhi Said I Will Sanction Pasupu Board To Nizamabad - Sakshi

ఆర్మూర్‌లో ప్రతిజ్ఞ చేసిన కాంగ్రెస్‌ ఎంపీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌

ఆర్మూర్‌: రాజ్యాంగ నిర్మాత డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సాక్షిగా పసుపు బోర్డును, ఎర్రజొన్నలకు కనీస మద్దతు ధరను, ఎన్‌ఆర్‌ఐ పాలసీని సాధిస్తానని నిజామాబాద్‌ పార్లమెంట్‌ కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్‌ అబేద్కర్‌ విగ్రహం ఎదుట ప్రతిజ్ఞ చేశారు. ఆర్మూర్‌ పట్టణంలోని అబేద్కర్‌ చౌరస్తాలో అంబేద్కర్‌ విగ్రహం ముందర ఉ గాది పర్వదినాన్ని పురస్కరించుకొని శనివారం ఈ ప్రతిజ్ఞ చేశారు.

ఈ మూడు సమస్యల పరి ష్కారం కోసం కృషి చేసి రైతులు, గల్ఫ్‌ బాధితుల రుణం తీర్చుకుంటానన్నారు. ఇచ్చిన మాటకు క ట్టుబడి తెలంగాణ అమరవీరుల బలిదానాలను చూడలేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయాన్ని తీసుకున్న సోనియాగాంధి రాజకీయ వారసుడైన ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ నేతృత్వంలో కేంద్రంలో ఏర్పడబోయే ప్ర భుత్వం ద్వారా సత్వరమే పసుపు బోర్డును ఏర్పాటు చేపిస్తానన్నారు.

వాణిజ్య పంట లైన పసుపు, ఎర్రజొన్నలను ఎంఎస్‌పీ ప రిధిలోకి తీసుకొని రైతులకు గిట్టుబాటు ధ  ర ఇప్పించే విధంగా కృషి చేస్తానన్నారు. ఉపాధి కోసం గల్ఫ్‌బాట పట్టి అర్ధాకలితో అలమటిస్తున్న గల్ఫ్‌ బాధితుల కోసం గల్ఫ్‌ పాలసీని రూపొందింపజేస్తానన్నారు. దేశంలోని అన్ని పార్టీల మద్దతును కూడగట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన కాంగ్రెస్‌ పార్టీకి పసుపు, ఎర్రజొ న్న రైతుల సమస్యలను పరిష్కరించడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటు వేసి తనను పార్లమెంట్‌కు పంపిం చాలని ఈ సందర్భంగా ప్రజలను కోరారు. ఆయన వెంట కాంగ్రెస్‌ పార్టీ ఎస్సీ సెల్‌ జిల్లా అధ్యక్షు డు పీసీ భోజన్న, టీపీసీసీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార చంద్రమోహన్, ఆలూర్‌ గంగారెడ్డి, ఇట్టెం జీవన్‌ తదితరులు పాల్గొన్నారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top