తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమ, అహంకార పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
హైదరాబాద్ : తెలంగాణలో కేసీఆర్ అవినీతి, అక్రమ, అహంకార పాలన సాగుతోందని కాంగ్రెస్ సీనియర్ నేత మధుయాష్కీ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తెలంగాణ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఆయన ఖండించారు. శుక్రవారం గాంధీభవన్లో మధుయాష్కీ మాట్లాడుతూ తెలంగాణలో గ్రామగ్రామన వసూళ్ల రాజ్యం నడుస్తోందని అన్నారు. అవినీతికి పాల్పడనని కేసీఆర్ ఎక్కడా ప్రమాణం చేయలేదన్నారు.
రాష్ట్రంలో అహంకారపూరిత దొర పాలన సాగుతోందని మధుయాష్కీ అన్నారు. ప్రజలను రెచ్చగొడుతూ చంద్రబాబు నాయుడు, కేసీఆర్ మైండ్ గేమ్ రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. విమలక్కపై కుట్ర కేసు కేసీఆర్ దొరతనానికి నిదర్శనమని మధుయాష్కీ విమర్శించారు.