‘ఎల్పీజీ’పై తొందరవద్దు!

LPG Gas Booking Are Increasing In Telangana - Sakshi

పది రోజులుగా భారీగా బుకింగ్‌లు

అనవసర బుకింగ్‌లు వద్దు:  ఆయిల్‌ కంపెనీలు

డిమాండ్‌ మేరకు సరఫరాకు హామీl

సిటీలో రోజుకు 3.50 లక్షలకు పెరిగిన బుకింగ్‌లు

సాక్షి, హైదరాబాద్‌: దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ కట్టుదిట్టంగా అమలవుతుండంతో వంట గ్యాస్‌ సిలిండర్ల బుకింగ్‌లు అనూహ్యంగా పెరుగుతున్నాయి. లభ్యత తగ్గిపోతుందన్న ఆందోళనతో వినియోగదారులు అవసరానికి మించి బుకిం గ్‌లు చేస్తుండటంతో డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో ఆయిల్‌ కంపెనీలపై ఒత్తి డి పెరుగుతోంది. ఈ క్రమంలో ఎల్పీజీ సిలిండర్ల కొరత ఎక్కడా లేదని, విని యోగదారులు ఆందోళనకు గురికావొద్దని ఇండియన్‌ ఆయిల్‌ కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ కళికృష్ణ ప్రకటించారు.

కొరత లేదు..
దేశవ్యాప్తంగా ఫిబ్రవరి, మా ర్చి నెలల్లో బుకింగ్‌లు పెరి గాయి. దేశవ్యాప్తంగా రోజుకు 15–18 లక్షల బుకింగ్‌లు ఉం టుండగా, మార్చి నాటికి 20 నుంచి 22 లక్షలకు పెరిగాయి. పది రోజులుగా ఏకంగా రోజుకు దేశవ్యాప్తంగా 25లక్షల బు కింగ్‌లు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో రోజుకు 2లక్షల వరకు బుకింగ్‌లు ఉంటుం డగా, అవిప్పుడు ఏకంగా 3.50లక్షల వరకు పెరిగాయి. రెండ్రోజుల కిందట వరకు తొలి సిలెండర్‌ బుకింగ్‌ చేసిన అనంతరం రెండో బుకింగ్‌ చేసేందుకు కేవలం ఒక్క రోజు వ్యవధి మాత్రమే ఉండటంతో బుకింగ్‌లు పెరగడంతో, ఆయిల్‌ కంపెనీలు పలు ఆంక్షలు తెచ్చాయి.

ఒక్కో సిలిండర్‌ బుకింగ్‌కు మధ్య గ్యాప్‌ను 14 రోజులకు పెంచాయి. అంటే 14 రోజుల తర్వాతే రెండో సిలిండర్‌ బుక్‌ చేసుకోవాలి. ఈ నేపథ్యంలో ప్రజల్లో ఆందోళన తగ్గించే ఉద్దేశంతో ఇండియన్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్‌తో పాటే ఎల్పీజీ నిల్వలు సరిపడేంతగా ఉన్నాయని, సాధారణంగా సరఫరాను సైతం కొనసాగిస్తున్నాయని ప్రకటించింది. అనవసరం బుకింగ్‌లు వద్దని, డిజిటల్‌ చెల్లింపులకు మొగ్గు చూపాలని సూచనలు చేసింది. ఎల్పీజీ వినియోగదారుల కోసం హెల్ప్‌లైన్‌ 1906ను ఏర్పాటు చేసినట్లు తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top