ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా | Lover Protest In Front Of Boyfriend | Sakshi
Sakshi News home page

ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలి ధర్నా

Jun 12 2019 8:38 AM | Updated on Jun 12 2019 8:38 AM

Lover Protest In Front Of Boyfriend - Sakshi

పరశురాముడు ఇంటి ఎదుట ధర్నా చేస్తున్న యువతి   

శ్రీరంగాపూర్‌: మండలంలోని వెంకటాపూర్‌లో మంగళవారం ప్రియుడి ఇంటి ఎదుట ప్రియురాలు ధర్నా చేపట్టింది. బాధితురాలి కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన యువతి(22) ఇదే గ్రామానికి చెందిన పరశురాముడు(30) గత ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. విషయం తెలిసిన కులపెద్దలు కులం, గోత్రం ఇద్దరివి ఒకటే కావడంతో వరుసలు కలువదని, ఇద్దరు పెళ్లి చేసుకోకూడదని ఒప్పంద పత్రాలు రాసుకున్నారు.

అనంతరం యువతికి మరొకరితో పెళ్లి కూడా చేశారు. కానీ ప్రియుడిపై ప్రేమతో పెళ్లయిన కొద్ది రోజులకే భర్తను వదిలి యువతి పుట్టింటికి వచ్చింది. ప్రస్తుతం పరశురాముడు మరో యువతితో పెళ్లికి సిద్ధపడడంతో తనకు న్యాయం చేయాలని ప్రియుడి ఇంటి ఎదుట ధర్నాకు దిగింది. తనకు 24 గంటల్లో న్యాయం చేయకపోతే పోలీసులను ఆశ్రయిస్తానని హెచ్చరించింది.

Advertisement
 
Advertisement
Advertisement