
మాట్లాడుతున్న ఎంఎస్‌ఎఫ్ నాయకులు
తుంగతుర్తి : స్థానిక పరిస్థితులపై అవగాహన ఉన్న స్థానిక నాయకులకే ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని ఎంఎస్‌ఎఫ్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ తడకమల్ల రవికుమార్ కోరారు. శనివారం మండల కేంద్రంలో ఆయన విలేకరులో మాట్లాడారు. స్థానికేతరులకు టికెట్ ఇస్తే వారు నియోజకవర్గంపై అవగాహనలేక అభివృద్ధికి కృషి చేయడంలేదని అన్నారు. ఈ సమావేశంలో ఎంఎస్‌ఎఫ్ నాయకులు కొండగడ్పుల శ్రీకాంత్, రాంబాబు, నరేష్, వెంకటేష్, సురేష్, పరశురాములు, శ్రీను, మహేష్ పాల్గొన్నారు.