ఓ కాలేజీ లెక్చరర్ విద్యార్థిని చితకబాదిన ఘటన కరీంనగర్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది.
* స్పృహ కోల్పోయిన వైనం
* బంధువుల ఆందోళన
గంగాధర : ఓ విద్యార్థిని లెక్చరర్ చితకబాదడంతో స్పృహకోల్పోయిన ఘటన మండల కేంద్రంలోని తేజస్విని కళాశాలలో గురువారం చోటుచేసుకుంది. వివరాలు విద్యార్థి బంధువులు, గ్రామస్తుల కథనం ప్రకారం.. మండలంలోని వెంకటాయిపల్లికి చెందిన బండ అరవింద్‌రెడ్డి గంగాధర చౌరస్తాలోని తేజస్విని కళాశాలలో ఇంటర్ ఫస్టియర్ చదువుతున్నాడు. జ్వరంతో బాధపడుతూ కొద్దిరోజుల పాటు ఆస్పత్రిలో చికిత్స పొందిన విద్యార్థి పది రోజులుగా కళాశాలకు వస్తున్నాడు. గురువారం మంచినీరు తాగేందుకు తరగతిగది నుంచి బయటకొచ్చాడు. గమనించిన లెక్చరర్ శ్రీనివాస్ ఎందుకొచ్చావని కొట్టాడు.
ఎందుకు కొడుతున్నారని విద్యార్థి ప్రశ్నించడంతో విచక్షణ కోల్పోయిన లెక్చరర్ విద్యార్థిని చితకబాదడంతో అరవింద్‌రెడ్డి స్పృహ కోల్పోయూడు. ఈ విషయూన్ని తోటి విద్యార్థులకు గ్రామస్తులకు తెలపగా.. విద్యార్థి తండ్రి చంద్రారెడ్డి కళాశాలకు చేరుకొని ఆస్పత్రికి తీసుకెళ్లాడు. అయినా స్పృహలోకి రాకపోవడంతో అంబులెన్స్‌లో కరీంనగర్ ఆస్పత్రికి తరలించారు. గ్రామస్తులతోపాటు, బంధువులు, టీఆర్‌ఎస్, బీజేపీ నాయకులు కళాశాలకు చేరుకోని ఆందోళనకు దిగారు. కుర్చీలు, బెంచీలు ఎత్తివేసి ఓ లెక్చరర్‌పై చేయిచేసుకున్నారు. ప్రస్తుతం విద్యార్థి కరీంనగర్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.