ఆ గ్రామంలో అన్నీ సమస్యలే..!

Kummari Gudem Villagers Facing Problems In Kanagal Mandal - Sakshi

     కంపచెట్లతో మూసుకుపోయిన రహదారి

     అందని కృష్ణా జలాలు డ్రెయినేజీ లేక నిల్వ ఉంటున్న మురుగు

     ఇబ్బందులు పడుతున్నకుమ్మరిగూడెం ప్రజలు పట్టించుకోని పాలకులు 

సాక్షి, కనగల్‌ : మండలంలోని అమ్మగూడెం పరిధి కుమ్మరిగూడెంకు వెళ్లే దారిలో కంపచెట్లు రహదారికి ఇరుపక్కల పెరగడంతో గ్రామస్తులు ఇబ్బంది పడుతున్నారు. ఊరు తూర్పు రోడ్డు మొత్తం కంపచెట్లుతో అల్లుకుపోవడంతో స్థానికులతోపాటు ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. గ్రామంలోకి వెళ్లాలంటే కంపచెట్లు అడ్డుగా ఉండడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొటున్నారు.చెరువు కట్టకు ఇరువైపులా పెరిగిన చెట్లు కంపచెట్లకుతోడు చిన్నపాటి వర్షానికే మట్టి రోడ్డు అంతా బురదమయం అవుతుండడంతో ప్రయాణం ప్రాణసంకటంగా మారింది. కంపచెట్లు తొలగించి రోడ్డును అభివృద్ధి చేయాలని గ్రామస్తులు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పాలకులు పట్టించుకోవడంలేదు. దీనితోపాటు గ్రామానికి ఎగువన ఉన్న చెరువు కట్టపై నుంచి నిత్యం వందలాది మంది రైతులు రాకపోకలు సాగిస్తుంటారు. కట్టపై ఇరుపక్కల కంపచెట్లు పెరగడంతో రైతులు వ్యవసాయ భూములకు వెళ్లేందుకు ఆటంకంగా మా రింది. కంపచెట్లను తొలగించాలని అమ్మగూడెం, కుమ్మరిగూడెం గ్రామాల ప్రజలు కోరుతున్నారు. 
సమస్యలతో సావాసం:
కుమ్మరిగూడెంలో ఒక్క డ్రెయినేజీ లేదు. దీంతో మురుగు వీధుల్లో పారుతుండడంతో ఈగలు, దోమలు ప్రబలుతున్నాయి. నల్లా పైపులు పలుచోట్ల పగిలి నీరు కలుషితం అవుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. గ్రామంలోకి కృష్ణాజలాల పైపులైన్‌ వేసినప్పటికీ రెండేళ్లుగా ప్రజలకు కృష్ణాజలాలు అందడంలేదు. ఎయిర్‌ వాల్వ్‌ దగ్గర నీళ్లు రా కుండా చేయడంతో పలుమార్లు చెప్పినా అధికారులు పట్టించుకోవడంలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. నిత్యం రూ. 10 వెచ్చింది శుద్ధ జలాలు కొనుక్కొని తాగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రామంలో సీసీ రోడ్లతోపాటు డ్రెయినేజీలు నిర్మించి, కంపచెట్లను తొలగించి గ్రామానికి దారి సౌకర్యం మెరుగుపర్చాలని గ్రామస్తులు కోరుతున్నారు. అదేవిధంగా గ్రామానికి కృష్ణాజలాలు సరఫరా అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
కంపచెట్లను తొలగించాలి:
గ్రామంలోకి వచ్చే దారిలో ఇరుపక్కల కంపచెట్ల పెరిగాయి. చెరువుకట్టపై సైతం కంపచెట్లు పెరిగి రాకపోకలకు అడ్డంకిగా మారింది. కంపచెట్లను తొలగించి గ్రామంలోకి వచ్చే రోడ్డును అభివృద్ధి చేయాలి.
   

–లక్ష్మీనారాయణ, కుమ్మరిగూడెం

కృష్ణాజలాలు అందించాలి:
గ్రామంలోకి కృష్ణాజ లాలు రాకపోవడంతో తాగునీటికి అవస్థలు పడుతున్నాం. గ్రామంలోకి కృష్ణాజలాలను స రఫరా చేయాలి. మా గ్రామం దాటి ఎం.గౌరారంకు కృష్ణాజలాలు వెళుతున్నా మాకు మాత్రం కృష్ణాజలాలు అందడంలేదు. సమస్యలను పరిష్కరించాలి.


  –తిరుమలేశ్, కుమ్మరిగూడెం 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top