వారి సేవలు, త్యాగాలు వెలకట్టలేనివి: కేటీఆర్‌

KTR Salute Indian Soldiers For Their Bravery - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: జాతీయ సైనిక దినోత్సవం సందర్భంగా భారత సైనికులకు శుభాకాంక్షలు తెలుపుతూ టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ట్వీట్‌ చేశారు. దేశం కోసం వారు చేసిన సేవలు, త్యాగాలు వెలకట్టలేనివని పేర్కొన్నారు. జవాన్ల ధైర్య, సాహసాలకు సెల్యూట్‌ చేస్తున్నానన్నారు. సైనికులకు, వారి కుటుంబ సభ్యలకు హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఇక ఇప్పటికే దేశ ప్రధాని నరేం‍ద్ర మోదీ,  రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌, పలువురు కేం‍ద్ర మంత్రులు, రాజకీయ ప్రముఖులు, సినీ తారలు భారత జవాన్లకు ఆర్మీడే శుభాకాంక్షలు తెలిపిన విషయం తెలిసిందే.

ఆర్మీ ‘డే’ నేపథ్యం..
1948వ సంవత్సరం చిట్టచివరి బ్రిటీష్‌ కమాండర్‌ ‘సర్‌ ఫ్రాన్సిస్‌ బచ్చర్‌’ నుంచి భారతీయ సైన్యం తొలి కమాండర్‌ ఇన్‌ చీఫ్‌ జనరల్‌ కరియప్ప జనవరి 15వ తేదీన దేశ సైనికాధికారి బాధ్యతలు స్వీకరించారు. దీంతో విదేశీ సైనిక పాలన నుంచీ దేశానికి విముక్తి లభించినట్లయింది. అందుకు గుర్తుగా ప్రతి ఏటా ‘జనవరి 15న’ ఆర్మీడే జరుపుకొంటున్నాం.  ఈ రోజున దేశం కోసం ప్రాణత్యాగాలు చేసిన జవానులకు ఢిల్లీలోని అమరజవాను జ్యోతి వద్ద నివాళులర్పిస్తారు. వారి త్యాగాలను స్మరించుకుంటారు. దేశసేవలో ఉత్తమ సాహసాలను ప్రదర్శించిన జవానులకు సేవా అవార్డులు సైతం అందజేస్తారు. (సైనికుడా.. వందనం)
 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top