‘బయో ఆసియా’లో స్విట్జర్లాండ్‌

KTR Meets Switzerland Council Silvana Wrangli Fray - Sakshi

భాగస్వామ్యానికి అంగీకారం

మంత్రి కేటీఆర్‌ సమక్షంలో ఒప్పందం

సాక్షి, హైదరాబాద్‌: లైఫ్‌ సైన్సెస్‌ రంగంలో తెలంగాణ తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటూ ప్రపంచంలో ప్రముఖ కేంద్రంగా మారుతోందని  మంత్రి కేటీఆర్‌ వ్యాఖ్యానించారు. ఏళ్ల తరబడి సాగుతున్న నిరంతర కృషితో ఇది సాధ్యమైందని చెప్పారు. సుమారు వంద దేశాల నుంచి లైఫ్‌ సైన్సెస్‌ దిగ్గజాలను ఆకర్షించడంలో ‘బయో ఆసియా 2020’సదస్సు కీలక పాత్ర పోషిస్తుందన్నారు. హైదరాబాద్‌లో జరిగే బయో ఆసియా సదస్సు నిర్వహణలో భాగస్వామ్యం వహించేందుకు స్విట్జర్లాండ్‌ ముందుకొచ్చింది. దీనికి సంబంధించి మంగళవారం కేటీఆర్‌ సమక్షంలో తెలంగాణ ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌ భాగస్వామ్యం ద్వారా అక్కడి కంపెనీలు, ప్రభుత్వంతో బహుముఖ సంబంధాలు ఏర్పడతాయని వ్యాఖ్యానించారు.

ఆవిష్కరణ రంగంలో ప్రపంచంలోనే అగ్రగామిగా ఉన్న స్విట్జర్లాండ్‌.. ప్రముఖ ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీలైన నోవార్టిస్, రోచ్, ఫెర్రింగ్‌ ఫార్మా వంటి వాటికి చిరునామాగా ఉందన్నారు. బయో ఆసియా సదస్సు నిర్వహణలో స్విట్జర్లాండ్‌తో తెలంగాణ ఒప్పందం కుదుర్చుకోవడం మంచి పరిణామం అని ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వ్యాఖ్యానించారు. హెల్త్‌ టెక్నాలజీ రంగంలో భారత్‌ను తాము వ్యూహాత్మక భాగస్వామిగా భావిస్తున్నామని స్విట్జర్లాండ్‌ డిప్యూటీ కాన్సుల్‌ జనరల్‌ సిల్వానా రెంగ్లి ఫ్రే ఆకాంక్షించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top