పక్కాగా పోతిరెడ్డిపాడు నీటి లెక్కలు

తెలంగాణ, ఏపీ అధికారులతో కృష్ణాబోర్డు భేటీ

సాక్షి, హైదరాబాద్‌: పోతిరెడ్డిపాడు నీటి వినియోగ లెక్కలు పక్కాగా ఉండేలా చూడాలని కృష్ణా బోర్డు నిర్ణయించింది. కృష్ణా బోర్డు కార్యాలయంలో బోర్డు చైర్మన్‌ సాహు అధ్యక్షతన గురువారం జరిగిన భేటీకి తెలంగాణ, ఏపీకి చెందిన చీఫ్‌ ఇంజనీర్లు, అధికారు లు హాజరయ్యారు. పోతిరెడ్డిపాడు టెలిమెట్రీ అంశం పైనే సుదీర్ఘంగా చర్చించారు. తెలంగాణ అదనంగా 21 పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటుకు ప్రతిపాదించింది. దీనిపై చర్చించేందుకు మరో పది రోజుల్లో భేటీ కావాలని నిర్ణయించారు.

పోతిరెడ్డిపాడు హెడ్‌ రెగ్యులేటర్‌ దిగువన 12.2 కి.మీ. వద్ద ఏర్పరిచిన పరికరం సరిగ్గా పనిచేయట్లేదని తేల్చారు. హెడ్‌ రెగ్యులేటర్‌కు సమీపంలో సైడ్‌ లుకింగ్‌ డాఫ్లర్‌ కరెంట్‌ ప్రొఫై లర్‌(ఎస్‌ఎల్‌డీసీపీ)ల ఏర్పాటు ద్వారా నీటి లెక్కలు సరిగ్గా తెలుస్తాయని సెంట్రల్‌ వాటర్, పవర్‌ రీసెర్చ్‌ స్టేషన్‌ శాస్త్రవేత్త కథే సూచించారు. బనకచర్ల వద్ద పరికరాలు ఏర్పాటు చేద్దామని సాహు సూచించారు.  

ఆ ప్రాంతాల్లో ఎస్‌ఎల్‌డీసీపీల ఏర్పాటు
కృష్ణా ప్రాజెక్టు పరిధిలో 3 వేల క్యూసెక్కులకు పైగా డిశ్చార్జి ఉన్న చోట ఎస్‌ఎల్‌డీసీపీలు ఏర్పాటు చేయా లని నిర్ణయించారు. జూరాల, నెట్టెంపాడు, కేసీ కెనా ల్, కల్వకుర్తి, సాగర్‌ ఎడమ, కుడి కాల్వలు, కృష్ణా డెల్టా వద్ద కొత్త పరికరాలు ఏర్పాటు చేసేందుకు బోర్డు యోచిస్తోంది. రెండో దశ టెలిమెట్రీపై ఇరు రాష్ట్రాలు అభ్యంతరం వ్యక్తం చేశాయి.

గుంటూరు చానెల్‌ వద్ద రాడార్‌ సెన్సార్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించగా.. ఈస్ట్, వెస్ట్‌ చానెల్స్‌ వద్ద 3 వేల క్యూసెక్కుల డిశ్చార్జి ఉంటున్నందున ఎస్‌ఎల్‌డీసీపీల ఏర్పాటుకు ఇరు రాష్ట్రాలు అంగీకరించాయి. మరో 6 పాయింట్ల వద్ద టెలిమెట్రీ ఏర్పాటు చేయాల నే ప్రతిపాదన నేపథ్యంలో జలసంఘం నుంచి తామే వివరాల్ని తీసుకుంటామని బోర్డు తెలిపింది.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top