అశ్రునివాళి
స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం గాంధీజీతో కాలు కదిపిన మహాయోగి.. తెలంగాణ శిఖరం.. మూడు తరాల వారధి..
	ప్రభుత్వ లాంఛనాలతో భూపతి కృష్ణమూర్తి అంత్యక్రియలు
	 
	స్వేచ్ఛ, స్వాతంత్య్రం కోసం గాంధీజీతో కాలు కదిపిన మహాయోగి.. తెలంగాణ శిఖరం.. మూడు తరాల వారధి.. అన్యాయంపై అగ్గిపిడుగైన నిప్పురవ్వ.. దేశ్‌ముఖ్ ఆగడాలకు ఎదురొడ్డి నిలిచిన ధీశాలి.. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో ‘తెలంగాణ’ సాధన కోసం పోరాడిన ఓరుగల్లు ముద్దుబిడ్డ.. తెలంగాణ కోసం పోరు సల్పిన స్ఫూర్తి ప్రదాత.. ఆయనే తెలంగాణ గాంధీ భూపతి కృష్ణమూర్తి..
	
	ఆయన ఆదివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.. సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమయూత్ర జరిగింది.. జన్మదినానికి ఐదు రోజుల ముందే నింగికేగడం విషాదంలో నింపింది.. ‘‘అమర్ రహే తెలంగాణ  గాంధీ కృష్ణమూర్తి.. జోహార్ తెలంగాణ గాంధీ..’’ అని భూపతికి ఆప్తులు,  బంధువులు, ప్రజాప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు..
	 - వరంగల్ అర్బన్       
	 

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
