ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం : కోమటి రెడ్డి | Komatireddy Venkatreddy Promises Munnuru Kapu For Establishing New Corporation | Sakshi
Sakshi News home page

ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తాం : కోమటి రెడ్డి

Dec 6 2018 12:26 PM | Updated on Dec 6 2018 12:26 PM

Komatireddy Venkatreddy Promises Munnuru Kapu For Establishing New Corporation - Sakshi

వెంకట్‌ నర్సయ్యకు కండువా కప్పుతున్న కోమటిరెడ్డి

సాక్షి, నల్లగొండ : కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాగానే మున్నూరు కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. న్యాయవాది కంచనపల్లి జవహర్‌లాల్‌ ఆధ్వర్యంలో వార్డెన్ల సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు, మున్నూరు కాపు సంఘం జిల్లా అధ్యక్షుడు వాసుదేవుల వెంకట్‌నర్సయ్యతోపాటు మాజీ కౌన్సిలర్‌ బోయినపల్లి గిరికుమార్‌ బుధవారం కోమటిరెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి వారికి కాంగ్రెస్‌ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం కోమటిరెడ్డి మాట్లాడుతూ మున్నూరు కాపులను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని ఆరోపించారు. వెంకట్‌నర్సయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మున్నూరుకాపుల అభివృద్ధిని విస్మరించిందని, సరైన రాజకీయ ప్రాధాన్యత కల్పించలేదని ఆరోపించారు. దీంతో తము సంఘం మహాకూటమికి మద్దతు ఇవ్వాలని నిర్ణయించామన్నారు. నల్లగొండలో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డిని గెలిపించేందుకు మున్నూరు కాపులంతా సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్సీ మాజీ సభ్యుడు సుధాకర్, రఘువీర్, శ్రీకాంత్, మేకల వెంకన్న, నేతి ఉమామహేశ్వర్, తోకల శ్రీనివాస్, సత్యనారాయణ, సిరిగిరి వెంకట్‌రెడ్డి, ఠాగూర్, వేణుగోపాల్‌రెడ్డి, శ్రీకాంత్, కవిత  పాల్గొన్నారు. 

మరిన్ని వార్తాలు...

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement