జూడాల వినతిపై కేసీఆర్ సానుకూల స్పందన | kcr responses judas request | Sakshi
Sakshi News home page

జూడాల వినతిపై కేసీఆర్ సానుకూల స్పందన

Feb 15 2015 4:02 PM | Updated on Aug 15 2018 9:27 PM

జూడాల వినతిపై కేసీఆర్ సానుకూల స్పందన - Sakshi

జూడాల వినతిపై కేసీఆర్ సానుకూల స్పందన

పీజీ అడ్మిషన్ల కోసం తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల(జూడాలు) వినతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు.

హైదరాబాద్: పీజీ అడ్మిషన్ల కోసం తమకు అవకాశం కల్పించాలన్న జూనియర్ డాక్టర్ల(జూడాలు) వినతికి తెలంగాణ సీఎం కేసీఆర్ సానుకూలంగా స్పందించారు. ఈ మేరకు ఆదివారం జూడాలు వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మణ్ రెడ్డి సమక్షంలో సీఎం కేసీఆర్ ను కలిశారు.  సమ్మె సమయంలో ప్రభుత్వం విజ్ఞప్తిని జూడాలు పెడచెవిన పెట్టిన సంగతిని కేసీఆర్ గుర్తు చేశారు. హైకోర్టు చెప్పినా.. భవిష్యత్తు పర్యవసనాలు ఆలోచించకుండా జూడాలు అప్పడు వ్యవహరించడం ఎంతమాత్రం సరికాదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.

 

తమ భవిష్యత్తు చెడిపోకుండా విద్యాసంవత్సరాన్ని కాపాడాలని కేసీఆర్ ను జూడాలు వారు కోరారు.జూడాల పీజీ కోర్సులో ప్రవేశం పొందేలా తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement