కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం | KCR photo anointed with alcohol | Sakshi
Sakshi News home page

కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం

Aug 26 2015 2:39 AM | Updated on Nov 9 2018 4:31 PM

కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం - Sakshi

కేసీఆర్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం

హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం

 హన్మకొండ : హన్మకొండలోని తెలంగాణ అమరవీరుల స్థూపం వద్ద టీఎన్‌ఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో సీఎం కేసీఆర్ ఫ్లెక్సీకి మంగళవారం మద్యం మద్యంతో అభిషేకం చేశా రు. అభిషేకం చేసిన టీఎన్‌ఎస్‌ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి మేడారపు సుదాకర్, విద్యార్థి నాయకులను సుబేదారి పోలీసు లు అదుపులోకి తీసుకొన్నారు. ఈ సందర్భంగా సుధాకర్ మాట్లాడారు. చీప్ లిక్కర్ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని, విద్యారంగ సమస్యలు పరిష్కరించే వరకు టీఎ ఎన్‌ఎస్‌ఎఫ్ పోరాటం చేస్తుందని అన్నారు. కార్యక్రమంలో టీఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాంబాబు, నగర కన్వీనర్ తక్కల్లపల్లి రాజు, ప్రధాన కార్యదర్శి లింగాల మధు. నాయకులు దొగ్గెల కుమారస్వామి, ముట్టె కిరణ్, ఎడ్ల అనిల్, కోడెల సాయిరాం తదితరులున్నారు.

 చీప్ లిక్కర్ బాటిళ్ల దండ..
 వరంగల్ చౌరస్తా : వరంగల్ స్టేషన్ రోడ్డులోని గాంధీ విగ్రహం వద్ద మాజీ శాఫ్ డెరైక్టర్, కాంగ్రెస్ నాయకుడు రాజనాల శ్రీహరి ఆధ్వర్యంలో మహిళలతో కలిసి సీయం కేసీఆర్ చిత్ర పటానికి చీప్ లిక్కర్ బాటిళ్లను దండగా వేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. లిక్కర్ మద్యం విధానాన్ని విడనాడలని, లేనియెడల ఎక్సైజ్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. కాంగ్రెస్ మహిళా విభాగం నాయకురాళ్లు జన్ను ప్రమీల, జన్ను పుష్పా,లక్ష్మి, విజయ,నాయకులు గోరేమియా, జహీర్ ఖాన్, అలగోజు రమేష్, బాలరాజు, రాజు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement