ఢిల్లీకి కేసీఆర్‌ | Kcr heads to delhi for eye treatment | Sakshi
Sakshi News home page

ఢిల్లీకి కేసీఆర్‌

Jun 21 2017 10:12 PM | Updated on Aug 15 2018 9:40 PM

ఢిల్లీకి కేసీఆర్‌ - Sakshi

ఢిల్లీకి కేసీఆర్‌

తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు.

23న కోవింద్‌ ‘రాష్ట్రపతి’ నామినేషన్‌ కార్యక్రమంలో పాల్గొననున్న కేసీఆర్‌
కేంద్ర మంత్రులతో భేటీ.. కంటి శస్త్రచికిత్స చేయించుకునే అవకాశం

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. బుధవారం రాత్రి శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి బయల్దేరి ఢిల్లీ చేరుకున్నారు. కొన్ని అధికారిక కార్యక్రమాలతో పాటు కేసీఆర్‌ తన కంటికి శస్త్ర చికిత్స కూడా చేయించుకుంటారని తెలిసింది. నిజానికి ఈ శస్త్రచికిత్స కోసం మే లోనే సీఎం తన కుటుంబసభ్యులతో పాటు ఢిల్లీ వెళ్లారు. వైద్య పరీక్షలు చేసిన వైద్యులు, కొద్ది రోజుల తర్వాతే శస్త్ర చికిత్స చేయించుకోవాలని సూచించినట్టు సమాచారం.

ఎన్డీఏ రాష్ట్రపతి అభ్యర్థి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈ నెల 23న నామినేషన్‌ దాఖలు చేయనున్నారు. ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొంటారు. కోవింద్‌ అభ్యర్థిత్వానికి టీఆర్‌ఎస్‌ ఇప్పటికే సంపూర్ణ మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతోనూ ముఖ్యమంత్రి భేటీ అవుతారు. ఆ మేరకు ఈ పర్యటనలో శస్త్ర చికిత్స చేయించుకోవచ్చని టీఆర్‌ఎస్‌ వర్గాల ద్వారా తెలుస్తోంది.

Advertisement
 
Advertisement
Advertisement