సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం | KCR fulfill ​his promise | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాం

May 10 2018 8:44 AM | Updated on Oct 16 2018 3:15 PM

KCR fulfill ​his promise - Sakshi

మెదక్‌ మున్సిపాలిటీ : ఈ నేలసాక్షిగా.. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్న సీఎం కేసీఆర్‌కు ఈ ప్రాంత ప్రజల తరుపున జీవితాంతం రుణపడి ఉంటానని డిప్యూటీ స్పీకర్‌ పద్మాదేవేందర్‌రెడ్డి అన్నారు. బుధవారం మెదక్‌ పట్టణంలో  జరిగిన సీఎం బహిరంగ సభలో డిప్యూటి స్పీకర్‌ మాట్లాడుతూ మెదక్‌ జిల్లా కేంద్రంగా చేయాలని ఇక్కడి నుండి ప్రాతినిథ్యం వహించిన  మాజీ ప్రధానమంత్రి ఇందిరాగాంధీ నుంచి ఎంతో మందికి దరఖాస్తులు ఇచ్చి దండం పెట్టుకున్న ఈ ప్రాంత ప్రజల కోరిక నేరవేరలేదన్నారు.

ఇక్కడి నుంచి ఒక్కొక్క కార్యాలయం తరలివెళ్తుంటే గుండె తరుక్కుపోయేదన్నారు.  కానీ 2014లో సీఎం కేసీఆర్‌ మెదక్‌ వచ్చిన సందర్భంగా మెదక్‌ జిల్లాను చేస్తానని మాట  ఇచ్చి ఆ మాట నిలబెట్టుకుని, నేడు కలెక్టరేట్‌ కార్యాలయం, ఎస్పీ కార్యాలయం భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం తనకు ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. మెదక్‌ను అత్యున్నత స్థానంలో నిలబెట్టెందుకు సీఎం కేసిఆర్‌ ప్రత్యేశ్రద్ధ వహించారని తెలిపారు. రైతు బాంధవుడు కేసీఆర్‌ అడగకుండా సింగూర్‌ నీళ్లు ఇచ్చారన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement