5 నిమిషాల్లో 900 పంచ్‌లు

Katurbha Girls School Student Got Wonder Book Of Record  - Sakshi

 కరాటేలో రికార్డు సాధించిన  నల్లమల విద్యార్థిని 

సాక్షి, అమ్రాబాద్‌ (అచ్చంపేట): పదర మండలం రాయలగండి కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని మహేశ్వరి కరాటేలో ఐదు నిమిషాల రెండు సెకన్లలో 900పంచ్‌లు కొట్టి ప్రపంచవండర్‌ బుక్‌ రికార్డు సాధించింది. విక్టరీ షోటోకాన్‌ ఆసోసియేషన్‌ వారి ఆధ్వర్యంలో ఆదివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఊర్కొండలో వండర్‌బుక్‌ ఇంటర్నేషనల్‌ రికార్డు పోటీలు నిర్వహించారు. మొత్తం 200మంది బాలికలు పాల్గొన్నారు.

అయితే, అందరూ కలిసి 5.2 నిమిషాల్లో ఒక లక్ష 50వేల పంచ్‌లు కొట్టగా.. మహేశ్వరీ అదే సమయానికి అత్యధికంగా 900 పంచ్‌లు కొట్టి వండర్‌బుక్‌ రికార్డు సాధించింది. ఈమేరకు వండర్‌బుక్‌ ఆఫ్‌ చీఫ్‌ ఇండియా కో–ఆర్డినేటర్‌ బింగి నరెందర్‌గౌడ్‌ చేతులమీదుగా  రికార్డు నమోదు పత్రాన్ని అందుకుంది. ఈమేరకు సోమవారం కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయానికి వచ్చిన విద్యార్థిని మహేశ్వరిని ఎస్‌ఓ ఉమాదేవి, వెన్నెల, మాస్టర్‌ లవకుమార్‌తో పాటు, ఉపాధ్యాయులు, తోటివిద్యార్థులు అభినందించారు. ఒక్క కరాటేలోనే కాదు అన్నిరంగాల్లో పట్టుదలతో క్రమశిక్షణతో విద్యార్థులు ముందుకెళ్తూ విద్య కొనసాగించాలని ఈ సందర్భంగా ఎస్‌ఓ ఉమాదేవి ఆశాభావం వ్యక్తం చేశారు.    

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top