దుబాయిలో గంభీర్‌పూర్‌ వాసి మృతి | Karimnagar Person Died In Dubai | Sakshi
Sakshi News home page

దుబాయిలో గంభీర్‌పూర్‌ వాసి మృతి

Jul 3 2019 10:52 AM | Updated on Jul 3 2019 11:11 AM

Karimnagar Person Died In Dubai - Sakshi

మృతుడు గణేష్‌

సాక్షి, వేములవాడ: కథలాపూర్‌ మండలం గంభీర్‌పూర్‌ గ్రామానికి చెందిన లంకదాసరి గణేశ్‌(46) అనే వ్యక్తి దుబాయిలో జరిగిన రోడ్డుప్రమాదంలో మృతి చెందినట్లు కుటుంబసభ్యులకు మంగళవారం సమాచారం అందింది. గ్రామస్తులు, బంధువులు తెలిపిన వివరాల ప్రకారం.. లంకదాసరి గణేశ్‌ ఉపాధి నిమిత్తం దుబాయి వెళ్లి అక్కడ అబుదాబి ఏరియాలో డెన్లామ్‌యామ్‌ కంపెనీలో కార్మికుడిగా పనిచేస్తున్నారు.

గత నెల 28న గణేశ్‌ పని నిమిత్తం నడిచి వెళ్తుండగా వాహనం ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతిచెందినట్లు అక్కడివారు కుటుంబసభ్యులకు మంగళవారం సమాచారమిచ్చారు. గణేశ్‌ రెండున్నర ఏళ్ల కిత్రమే ఇంటికి వచ్చి దుబాయి వెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. మృతుడికి భార్య అంజమ్మ, కూతురు, కుమారుడు ఉన్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని గ్రామస్తులు కోరుతున్నారు. 

బాధిత కుటుంబానికి పరామర్శ 
లంక దాసరి గణేశ్‌ దుబాయిలో మృతిచెందగా.. మంగళవారం గల్ఫ్‌ తెలంగాణ వెల్ఫేర్‌ అసోషియేషన్‌ ప్రతినిధి బసంత్‌రెడ్డి గంభీర్‌పూర్‌లో బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. మృతుడి కుటుంబ వివరాలు తెలుసుకున్నారు. మృతదేహం స్వగ్రామానికి పంపించేందుకు సహకరిస్తామని ప్రతినిధులు పేర్కొన్నారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement