షోలాపూర్‌ టు తెలంగాణ.. 68 మంది యువతులు

kalvakuntla kavitha Helping Hand To 68 young womens - Sakshi

మాజీ ఎంపీ కవిత సహకారంతో సొంతూళ్లకు రాక

సాక్షి, హైదరాబాద్‌: లాక్‌డౌన్‌ కారణంగా మహారాష్ట్రలోని షోలాపూర్‌లో చిక్కుకుపోయిన 68 మంది తెలంగాణ యువతులు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత చొరవతో బుధవారం స్వస్థలాలకు చేరుకున్నారు. తెలంగాణలోని వివిధ జిల్లాలకు చెందిన 68 మంది యువతులు షోలాపూర్‌లోని ఓ వ్యవసాయ కేంద్రంలో శిక్షణ కోసం వెళ్లారు. లాక్‌డౌన్‌ ప్రారంభం కావడం తో వారికి అక్కడ ఒక ప్రైవేటు కాలేజీలో వసతి ఏర్పాటు చేశారు. అయితే ఇరుకు గదుల్లో ఎక్కువ మంది ఉండటం, పూర్తి స్థాయిలో సౌకర్యాలు లేకపోవడంతో యువతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

వీరి సమస్యను యువతుల కుటుంబసభ్యులు ఒకరు ట్విట్టర్‌ ద్వారా కవిత దృష్టికి తీసుకువచ్చారు. వెంటనే స్పందించిన ఆమె వారి కోసం మూడు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయించి, భౌతిక దూరం పాటించేలా జాగ్రత్తలు తీసుకుని స్వస్థలాలకు చేరేలా సాయం అందించారు. ఈ సందర్భంగా యువతుల తల్లిదండ్రులు కవితకు కృతజ్ఞతలు తెలిపారు. స్వస్థలాలకు చేరుకున్న యువతులను అధికారులు క్వారంటైన్‌కు తరలించారు.  

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top