ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు వివిధ రకాల సమస్యల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ రంగారావు
కేయూ క్యాంపస్ : ఉద్యోగ సంఘాల ఒత్తిళ్లతోపాటు వివిధ రకాల సమస్యల నేపథ్యంలో కాకతీయ యూనివర్సిటీ ఇన్‌చార్జి రిజిస్ట్రార్ పదవికి రాజీనామా చేసిన ప్రొఫెసర్ రంగారావు తాను ఆ పదవిలో కొనసాగలేనని స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ మేరకు కేయూ ఇన్‌చార్జి వీసీ వీరారెడ్డికి ఫ్యాక్స్ ద్వారా రాజీనామా పత్రం సమర్పించినట్లు సమాచారం. ఈ నెల 13న యూనివర్సిటీలో జరిగిన పరిణామాలు, అనేక సమస్యలు పరిష్కరించలేని స్థితి, ఒత్తిళ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. అరుుతే ఇదే విషయమై ఇన్‌చార్జి వీసీ ప్రొఫెసర్ వీరారెడ్డి ప్రొఫెసర్ రంగారావుకు ఫోన్ చేసి ఏప్రిల్ 18 వరకు తాను ఇన్‌చార్జీ వీసీగా ఉంటానని, అప్పటి వరకైనా ఉండాలని ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగాలని కోరినట్లు సమాచారం.
అరుుతే ప్రొఫెసర్ రంగారావు మాత్రం ఆ బాధ్యతలను మళ్లీ స్వీకరించబోననిస్పష్టం చేసినట్లు తెలిసింది. యూనివర్సిటీలోని ఉద్యోగ సంఘాల్లోని పలువురు కూడా రంగారావును ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా కొనసాగాలని కోరినా ఉండబోనని తెగేసి చెప్పినట్లు సమాచారం. ఇన్‌చార్జి వీసీ వీరారెడ్డి యూనివర్సిటీలో జరుగుతున్న పరిణామాలను ఉన్నత విద్య ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టికి తీసుకపోనున్నారు. ఈ వ్యవహారం కాస్తా రాష్ట్ర ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ టి.పాపిరెడ్డి దృష్టికి వెళ్లడంతో ఆయన మరోప్రొఫెసర్‌ను ఇన్‌చార్జి రిజిస్ట్రార్‌గా నియమించాలని భావిస్తున్నట్లు తెలిసింది.
గాడితప్పిన పాలన
క్రమశిక్షణ తప్పిన కాకతీయ యూనివర్సిటీలో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా కూడా కొన్నిపనులు చేయాలనే వారు అధికారులపై వివిధరకాలుగా ఒత్తిళ్లకు గురిచేస్తున్నారు. దీంతో ఈ పదవి ముళ్ల కిరీటంగా మారిం ది. జిల్లాకు చెందిన కడియం శ్రీహరి విద్యాశాఖమంత్రిగా ఉన్నందున యూనివర్సిటీకి సంబంధించి రెగ్యులర్ వీసీని, రెగ్యులర్ రిజిస్ట్రార్‌ను త్వరగా నియమించేలా చొరవ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది.