ఉమ్మడి హైకోర్టు సీజేగా రాధాకృష్ణన్‌ ప్రమాణం

Justice Radhakrishnan Taken oath as New CJ of Hyderabad HC - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ టీబీ రాధాకృష్ణన్‌ ప్రమాణం చేశారు. హైకోర్టు 93వ చీఫ్‌ జస్టిస్‌గా(ఉమ్మడి హైకోర్టుకు రాధాకృష్ణన్‌ 4వ సీజే) తాజాగా ఆయన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో శనివారం ఉదయం రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ రాధాకృష్ణన్‌చే సీజేగా ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌ రావు, హైకోర్టు న్యాయమూర్తులు హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాల సీఎస్‌లు, డీజీపీలు, పలువురు మంత్రులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

రాధాకృష్ణన్‌ గురించి... 1959 ఏప్రిల్‌ 29న తొట్టథిల్‌ భాస్కరన్‌ నాయర్‌ రాధాకృష్ణన్‌ జన్మించారు. కర్నాటక కేజీఎఫ్‌ లా కాలేజి నుంచి ఆయన ఎల్‌ఎల్‌బీ చేశారు. 2004లో కేరళ హైకోర్టు జడ్జిగా నియమితులయ్యారు. 2017 నుంచి ఛత్తీస్‌గడ్‌ ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు చేపట్టారు. ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top