జూరాలకు కొనసాగుతున్న ప్రవాహం | Jurala Project Water Level Rise With Flood Waters | Sakshi
Sakshi News home page

జూరాలకు కొనసాగుతున్న ప్రవాహం

Sep 14 2017 11:34 AM | Updated on Aug 1 2018 3:59 PM

జూరాల ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది.

హైదరాబాద్: జూరాల ప్రాజెక్టుకు 28 వేల క్యూసెక్కుల వరద కొనసాగుతున్నది. ఔట్‌ఫ్లో 30,680 క్యూసెక్కులు ఉన్నది. 2 యూనిట్లలో విద్యుదుత్పత్తి చేస్తూ నదిలోకి 24 వేల క్యూసెక్కులను వదులుతున్నారు. లిఫ్టులు, కాల్వలకు 6600 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 9.377 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ఆల్మట్టి ప్రాజెక్టులోకి 12,023 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా, వచ్చే నీటిని మొత్తం దిగువకు వదులుతున్నారు. నారాయణపూర్‌లోకి 11,350 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 10,647 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో కొనసాగుతున్నది.
 
ఇదిలా ఉండగా నాగర్ కర్నూల్ జిల్లా మహత్మాగాంధీ కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో లిఫ్టు పంప్ హౌస్ వద్ద రెండు మోటర్లు ఆన్ చేసి 1600 క్యూసెక్కుల నీటిని జొన్నలబొగుడ రిజర్వాయర్‌ను నింపుతున్నారు. జిల్లా తాగునీటి అవసరాలకు వీటిని వినియోగించనున్నట్టు అధికారులు తెలిపారు. సుంకేసుల డ్యాంకు ఎగువ నుంచి ఇన్‌ఫ్లో కొనసాగుతున్నది. ఎగువ నుంచి 4 వేల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా, ఔట్ ప్లో 4 వేల క్యూసెక్కులున్నట్లు జేఈ శ్రీనివాస్ తెలిపారు. ఒక గేటు సగం మేర ఎత్తి నీటిని వదిలినట్టు ఆయన తెలిపారు .

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement