'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి' | Junior doctors call off strike within 48 hours, says High court | Sakshi
Sakshi News home page

'జూడాలు 48 గంటల్లోగా సమ్మె విరమించాలి'

Nov 19 2014 11:25 AM | Updated on Aug 31 2018 8:26 PM

జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: జూనియర్ డాక్టర్లు చేపట్టిన సమ్మెను 48 గంటల్లోగా విరమించాలని హైకోర్టు ఆదేశించింది. ఆ దిశగా చర్యలు చేపట్టాలని తెలంగాణ ప్రభుత్వాన్ని సూచించింది. జూడాల ఆందోళనపై హైకోర్టు బుధవారం తీర్పును వెలువరించింది. ఈ 48 గంటల్లో జూడాలపై ఎటువంటి చర్యలు చేపట్టవద్దని తెలంగాణ ప్రభుత్వానికి సూచించింది. జూడాల ఆందోళన చట్ట వ్యతిరేకమని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామీణ సర్వీసు మినహా జూడాల మిగత అన్ని సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వైద్య విద్యలో భాగంగా ఏడాది పాటు గ్రామీణ ఆసుపత్రుల్లో జూడాలు సేవలందించాలన్న ప్రభుత్వ నిర్ణయించింది. అందుకోసం జీవో 107 తెలంగాణ ప్రభుత్వం జారీ చేసింది. దీనిపై ఆగ్రహించిన జూడాలు అక్టోబర్ 1వ తేదీన సమ్మె బాట పట్టారు. నాటి నుంచి వారు నిరవధిక సమ్మెకు చేయడంతో... రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లోని రోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement