ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
హైదరాబాద్: ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని, చెరుకు రైతులకు రావాల్సిన బకాయిలను ఇప్పించాలని సీఎల్పీ ఉపనాయకుడు టి.జీవన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ చెరుకు రైతులకు, ప్రైవేటు చక్కెర కర్మాగారాల నుంచి రూ.25 కోట్ల మేర బకాయిలు రావాల్సి ఉందన్నారు. ప్రైవేటు చక్కెర ఫ్యాక్టరీలతో ప్రభుత్వం కుమ్మక్కు అయిందనే అనుమానాలు కలుగుతున్నాయని జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.