నేటి నుంచి జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్ | JEE Main registration | Sakshi
Sakshi News home page

నేటి నుంచి జేఈఈ మెయిన్ రిజిస్ట్రేషన్

Nov 7 2014 7:03 AM | Updated on Sep 2 2017 4:02 PM

ఎన్‌న్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం 2015 ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించే ఆఫ్‌లైన్ పరీక్ష, అదే నెల 9, 11, 12, 19 తేదీల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు.

సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాల కోసం 2015 ఏప్రిల్ 6వ తేదీన నిర్వహించే ఆఫ్‌లైన్ పరీక్ష, అదే నెల 9, 11, 12, 19 తేదీల్లో నిర్వహించే ఆన్‌లైన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు శుక్రవారం నుంచి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. పరీక్ష ఏర్పాట్లను చూస్తున్న సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఫీజు చెల్లింపునకు కూడా అవకాశం కల్పించింది. ఇందుకోసం వెబ్ పోర్టల్‌ను (jeemain. nic.in/jeemainapp/root/loginpage.aspx) ఏర్పాటు చేసింది. సమగ్ర వివరాలతో కూడిన జేఈఈ మెయిన్ సమాచార బ్రోచర్‌ను సీబీఎస్‌ఈ శుక్రవారం నుంచి అందుబాటులో ఉంచనుంది.

 

విద్యార్థులు వెబ్‌పోర్టల్‌లోకి వెళ్లి వివరాలను పొందవచ్చు. దరఖాస్తు విధానానికి సంబంధించిన కొన్ని సూచనలను కూడా ఇన్‌స్ట్రక్షన్స్ అనే ప్రత్యేక లింక్‌లో పొందుపరిచింది. 12వ తరగతి/ తత్సమాన/ఇంటర్మీడియెట్ ద్వితీయ సంవత్సరం చదు వుతున్న విద్యార్థులు దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.

బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీర్/ బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ కోసం పేపరు-1 పరీక్షను, బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్/బ్యాచిలర్ ఆఫ్ ప్లానింగ్ కోసం జేఈఈ మెయిన్ పేపరు-2 పరీక్ష రాయాల్సి ఉంటుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో పరీక్ష ఫీజును క్రెడిట్‌కార్డు/డెబిట్‌కార్డు/ఈ-చలానా రూపంలో చెల్లించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement