రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు  | JEE Advanced 2018 Results Out On June 10 | Sakshi
Sakshi News home page

రేపు జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలు 

Jun 9 2018 12:54 AM | Updated on Jun 9 2018 12:54 AM

JEE Advanced 2018 Results Out On June 10 - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఐఐటీల్లో ప్రవేశాలకు గత నెల 20న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ఫలితాలను ఆదివారం విడుదల చేసేందుకు ఐఐటీ కాన్పూర్‌ ఏర్పాట్లు చేస్తోంది. జూన్‌ 15 నుంచి ప్రవేశాలకు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించేందుకు జాయింట్‌ సీట్‌ అలొకేషన్‌ అథారిటీ (జోసా) చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలను విడుదల చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ పరీక్షలకు దేశ వ్యాప్తంగా 1,55,091 మంది హాజరుకాగా రాష్ట్రం నుంచి 14 వేల మంది హాజరయ్యారు.

Advertisement
 
Advertisement
Advertisement