
సాక్షి, హైదరాబాద్: ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ (ఐఎస్‌ఎస్) అధికారులు పరిపాలనా విభాగాల్లో ఉన్నత స్థానాలకు చేరుకోవాలని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రం (ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ) డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య అన్నారు. ఐఎస్‌ఎస్‌ల శిక్షణ నిమిత్తం నేషనల్ స్టాటిస్టికల్ సిస్టమ్స్ ట్రయినింగ్, కేంద్ర స్టాటిస్టికల్ ప్రోగ్రాం ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ సహకారంతో నిర్వహించిన ‘మిడ్ కెరీర్ మేనేజ్‌మెంట్ డెవలప్‌మెంట్’ముగింపు కార్యక్రమానికి శుక్రవారం ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.
ఈ కార్యక్రమం ఐఎస్‌ఎస్‌లకు సాధికారతను చేకూర్చి,పరిపాలనా విభాగాల్లో ఉన్నతస్థానాలకు చేరుకునేందుకు ఉపయోగపడుతుందన్నారు. ఐఎస్‌ఎస్‌లు నిత్యం తమ నైపుణ్యాలను మెరుగుపరుచుకుంటూ కమ్యూనికేషన్ టెక్నాలజీతో అప్‌డేట్ కావాలన్నారు. కార్యక్రమంలో దేశవ్యాప్తంగా వివిధ మంత్రిత్వశాఖల నుంచి ఐఎస్‌ఎస్‌లు పాల్గొన్నారు.