రైళ్లకు బ్రేకులు... ప్రయాణికుల పాట్లు | inturruption to the several trains dueto technical problem | Sakshi
Sakshi News home page

రైళ్లకు బ్రేకులు... ప్రయాణికుల పాట్లు

Mar 9 2015 11:52 PM | Updated on Sep 2 2017 10:33 PM

ఖాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గంలో బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌ల మధ్య సోమవారం ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో మార్గం మధ్యలో నిలిచిపోవడంతో... పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.

నల్లగొండ జిల్లా: ఖాజీపేట-సికింద్రాబాద్ రైల్వే మార్గంలో బీబీనగర్-ఘట్‌కేసర్ రైల్వేస్టేషన్‌ల మధ్య సోమవారం ఓ గూడ్స్ రైలు సాంకేతిక లోపంతో మార్గం మధ్యలో నిలిచిపోవడంతో... పలు ఎక్స్‌ప్రెస్, పాసింజర్ రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. ఫలితంగా ఆయా రైళ్లలోని ప్రయాణికులు గంటల తరబడి నిరీక్షించాల్సి వచ్చింది. ఆలేరులో తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌ను సుమారు గంట 25 నిమిషాల పాటు నిలిపివేశారు. అలాగే వంగపల్లిలో ఫలక్ నుమా, పెంబర్తి రైల్వేస్టేషన్‌లో కృష్ణా ఎక్స్‌ప్రెస్‌ను నిలిపివేశారు. వీటితో పాటు ఇంకా పలు చోట్ల రైళ్లను ఆపివేయాల్సి వచ్చింది. కొందరు ప్రయాణికులు రైలు దిగి బస్సులను, ప్రైవేటు వాహనాలను ఆశ్రయించారు.
(ఆలేరు)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement