ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి | intermediate student suspicious death in adilabad district | Sakshi
Sakshi News home page

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

Jan 3 2016 4:48 PM | Updated on Aug 17 2018 2:53 PM

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి - Sakshi

ఇంటర్ విద్యార్థి అనుమానాస్పద మృతి

ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు.

ఖానాపూర్: ఆదిలాబాద్ జిల్లాలో ఇంటర్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతిచెందాడు. ఖానాపూర్లోని సాయిబాబా ఆలయం పక్కనున్న అటవీ ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం విద్యార్థి మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు.

కడెం మండలం లింగాపూర్ గ్రామానికి చెందిన జనార్దన్(16) నిర్మల్ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శుక్రవారం కాలేజీకి రమ్మని ప్రిన్సిపాల్ ఫోన్‌చేయడంతో కాలేజీకి వెళ్లిన జనార్దన్ తిరిగి ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం మధ్యాహ్నం అడవికి వెళ్లిన స్థానికులకు శవం కనిపించడంతో ఖానాపూర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

పోలీసులు సంఘటన స్థలాన్ని చేరుకుని మృతుని జేబులో నుంచి ఒక ప్రేమ లేఖను స్వాధీనం చేసుకున్నారు. ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడా, లేక ఎవరైనా చంపి ఉంటారా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. కళాశాల ప్రిన్సిపాల్ వేధింపుల వల్లే తమ కొడుకు మృతిచెందాడని జనార్దన్ తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఖానాపూర్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement