అప్పు తీర్చలేదని ఇంటికి తాళం

Interest Merchant Locked House Locked in Karimnagar For Loan  - Sakshi

అరగంటలోనే తాళం తీయించిన ఎస్సై  

ఇరువర్గాలకు సముదాయింపు  

డబ్బు చెల్లింపునకు ఇరువురి నడుమ ఒప్పందం

సద్దుమణిగిన సమస్య

ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాకీ చెల్లించడంలేదని అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి  ఇంటికి తాళం వేయించిన సంఘటన ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఒడ్డె శాంతవ్వ 15 నెలలక్రితం అదే గ్రామానికి చెందిన మహమ్మద్‌ ముస్తాఫాకు 2 శాతం వడ్డీపై రూ.2.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం మూలంగా వాయిదా ప్రకారం ముస్తాఫా శాంతవ్వకు డబ్బు ఇవ్వలేకపోయాడు.

కుటుంబసభ్యులను బయటకు పంపి ఇంటికి తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరగంటలోపే తాళాన్ని తీయించి సమస్యపై సోమవారం మాట్లాడతామని ఇద్దరికీ హామీ ఇచ్చారు. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో సముదాయించి వాయిదా పద్ధతిలో డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. సమస్యను ఇద్దరి సమ్మతితో ఎలాంటి కేసు లేకుండా పరిష్కారం చేసిన ఎస్సై ప్రవీణ్‌కుమార్‌ తీరును పలువురు ప్రశంసించారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top