breaking news
Lock house
-
అప్పు తీర్చలేదని ఇంటికి తాళం
ఎల్లారెడ్డిపేట(సిరిసిల్ల): బాకీ చెల్లించడంలేదని అప్పు ఇచ్చిన వడ్డీ వ్యాపారి ఇంటికి తాళం వేయించిన సంఘటన ఆదివారం ఎల్లారెడ్డిపేట మండలంలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి..ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల బొప్పాపూర్‌కు చెందిన ఒడ్డె శాంతవ్వ 15 నెలలక్రితం అదే గ్రామానికి చెందిన మహమ్మద్ ముస్తాఫాకు 2 శాతం వడ్డీపై రూ.2.10 లక్షలు అప్పుగా ఇచ్చారు. అప్పు తీర్చడంలో ఆర్థిక ఇబ్బందులు ఉండడం మూలంగా వాయిదా ప్రకారం ముస్తాఫా శాంతవ్వకు డబ్బు ఇవ్వలేకపోయాడు. కుటుంబసభ్యులను బయటకు పంపి ఇంటికి తాళం వేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు అరగంటలోపే తాళాన్ని తీయించి సమస్యపై సోమవారం మాట్లాడతామని ఇద్దరికీ హామీ ఇచ్చారు. ఇరువర్గాలు పోలీస్‌స్టేషన్‌కు రావడంతో సముదాయించి వాయిదా పద్ధతిలో డబ్బు ఇవ్వడానికి ఒప్పందం కుదిర్చారు. సమస్యను ఇద్దరి సమ్మతితో ఎలాంటి కేసు లేకుండా పరిష్కారం చేసిన ఎస్సై ప్రవీణ్‌కుమార్ తీరును పలువురు ప్రశంసించారు. -
పిల్లలు పుట్టడం లేదని.. భార్యకు వేధింపులు
హైదరాబాద్ సిటీ : ప్రేమించి పెళ్లి చేసుకుని పిల్లలు కాలేదని కారణంతో భార్యను వేధిస్తూ ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయిన ఓ ప్రభుత్వ ఉద్యోగి ఇంటి ముందు భార్య ధర్నాకు దిగింది. వివరాలు..నాగోలు ప్రాంతానికి చెంది న వసంతకుమార్ నగరంలోని ఫిషరీస్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వోద్యోగి. తొమ్మిది సంవత్సరాల క్రితం నగరానికి చెందిన సరితను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది. రెండు సంవత్సరాల నుంచి పిల్లలు కావడం లేదని వసంత్‌కుమార్ భార్య సరితను మానసికంగా వేధించడం మొదలుపెట్టాడు. దీంతో సరిత ఎల్బీనగర్ పోలీస్‌స్టేషన్, సరూర్‌నగర్ మహిళా పోలీస్‌స్టేషన్‌లలతో పాటు నగరంలోని పలు పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసింది. పెద్దల సమక్షంలో ఇద్దరూ రాజీ కుదుర్చుకున్నారు. వారం రోజుల క్రితం భర్త వసంతకుమార్ సరితపై దాడిచేసి నాగోలు లలితా నగర్లో ఉంటున్న ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయాడు, దీంతో కుటుంబసభ్యులతో ఇంటికి రాగా తాళం వేసి ఉండటంతో పాటు ఎవరూ పట్టించుకోలేదు. దీంతో సోమవారం సరిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగింది. తనకు ఎవరూ న్యాయం చేయడం లేదని పేర్కొంది.