పాదచారులపైకి దూసుకెళ్లిన ఇన్నోవా.. ముగ్గురు మృతి

Innova Hits Pedestrians In Rajapur Mahabubnagar - Sakshi

సాక్షి, మహబూబ్‌నగర్ : జిల్లాలోని రాజాపూర్‌ మండలం కుచ్చెర్కల్‌ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పాదచారులపైకి ఇన్నోవా దూసుకురావడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మగ్గురు పాదచారులు ప్రాణాలు కోల్పోయారు. మృతులను రంగయ్య, యాదగిరి, చంద్రయ్యలుగా గుర్తించారు. అయితే ఇన్నోవా వాహనంలో ఉన్నవారు మాత్రం ప్రమాదం జరిగిన పట్టించుకోకుండా వెళ్లిపోయారు. దీంతో ఆ వాహనాన్ని వెంబడించిన పలువురు యువకులు రంగారెడ్డిగూడ వద్ద దానిని అడ్డగించారు. అనంతరం ఆ వాహనాన్ని రాజాపూర్‌ పోలీసు స్టేషన్‌కు తరలించారు. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top